నువ్వు పదునైన
మంచు ముక్కవే...
కోత పడకుండా మది లోలోపలికి ...
నిక్కచ్చిగా సూదంటూ రాయిలా..
మదిలో దారిని వెతుకుతూ..
కాలపు అంచున నిలచి....
సుతిమెత్తనంగా నీ స్థానాన్ని
పదిలపరుచుకున్నావు కదూ
ఓయ్
నువ్వు కాస్తంత
చతురుడివే సుమా...